హరితహారం మొక్కల తొలగింపు
ABN , First Publish Date - 2023-12-10T23:31:26+05:30 IST
మండలంలోని ఆచంపల్లిలో రోడ్డు పక్కన నాటిన హరితహారం మొక్కలను తొలగించారు.
గంగాధర, డిసెంబరు 10: మండలంలోని ఆచంపల్లిలో రోడ్డు పక్కన నాటిన హరితహారం మొక్కలను తొలగించారు. హరితహారంలో భాగంగా గంగాధర మండలం ఆచంపల్లిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. కొండాపూర్ రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటించారు. సంవత్సర కాలంగా వాటిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో నీరు పోసి, ట్రీగాడ్స్ ఏర్పాటు చేసి సంరక్షించారు. ఏపుగా పెరిగిన మొక్కలను కొందరు తమ స్థలాల అభివృద్ధి పేరుతో రోడ్డు పక్కన నాటిన మొక్కలను పూర్తిగా తొలగించారు. సుమారుగా వంద వరకు వివిధ రకాల మొక్కలను తొలగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మొక్కలు నాటుతుంటే తొలగించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.