మీ పోలీస్‌ స్టేషన్‌కు రేటింగ్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2023-04-19T23:49:11+05:30 IST

క్యూ ఆర్‌ స్కాన్‌ ద్వారా మీ పోలీస్‌స్టేషన్‌కి రేటింగ్‌ ఇచ్చి అభిప్రాయాన్ని తెలు పాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మీ పోలీస్‌ స్టేషన్‌కు రేటింగ్‌ ఇవ్వండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 19: క్యూ ఆర్‌ స్కాన్‌ ద్వారా మీ పోలీస్‌స్టేషన్‌కి రేటింగ్‌ ఇచ్చి అభిప్రాయాన్ని తెలు పాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ సదుపాయం లేని వారు 6303922572కు వాట్సప్‌ మెసేజ్‌ చేయవచ్చాన్నారు. ప్రజల అభిరప్రాయాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు చెప్పారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ అంటించి ఉంటుందన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరుకు సంబంధించిన క్యూఆర్‌కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మీ మొబైల్‌లో ఉన్న క్యూఆర్‌ స్కానర్‌ ద్వారా కోడ్‌ని స్కాన్‌చేయగానే మెయిల్‌ ద్వారా లాగిన్‌ కావాలని, తర్వాత ఫాం ఓపెన్‌ అవుంతుందని అన్నారు. అందులో పోలీస్‌ష్టేషన్‌లో పరిశుభ్రత, పచ్చదనం, వసతులపై అభిప్రాయాలు తెలుపాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో మెరుగు పర్చాల్సిన విషయాలను చెప్పవచ్చన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ రవికుమార్‌, టౌన్‌ సీఐ అనిల్‌ కుమార్‌, రూరల్‌ ిసీఐ ఉపేందర్‌, కరుణాకర్‌ పాల్గొన్నారు.

మొబైల్‌ పోతే మీ సేవలో ఫిర్యాదు చేయవచ్చు

మొబైల్‌ ఫోన్‌ పోయినా, చోరీకి గురైనా వెంటనే మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యా యంలో ఆయన మాట్లాడారు. ఇందుకోసం సీఈఐఆర్‌ అప్లికేషన్‌ను పొందుపర్చామన్నారు. అప్లికేషన్‌ ద్వారా సంబంధిత ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌లను నమోదు చేసి చెక్‌ చేసుకోవాలని అన్నారు. పోలీస్‌ స్టేసన్‌ సిబ్బందికి అప్లికేషన్‌పై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ అప్లికేషన్‌ ద్వారా ఫోన్‌లను వెతికి పట్టుకోవడానికి తోడ్పడుతుందన్నారు. సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌లు కోనేముందు అప్లికేషన్స్‌లో వివరాలను నమోదు చేసి చెక్‌ చేసుకోవాలన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించా మన్నారు. టెలీకాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటీటీ రిజిస్టర్‌ను ప్రవేశ పెట్టిందని ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలని అన్నారు. ఈ ఎక్విప్‌మెంట్‌ ద్వారా సమా చారాన్ని నమోదు చేస్తే పోయిన మొబైల్‌ త్వరగా దొరకడానికి అవకాశం ఉందన్నారు.

Updated Date - 2023-04-19T23:49:11+05:30 IST