సమ్మె శిబిరంలోనే ఏఎన్‌ఎంల రాఖీ పండుగ
ABN , First Publish Date - 2023-09-01T00:15:50+05:30 IST
తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అర్బన్ ఏఎన్‌ఎంలు రాఖీ పండుగను శిబిరంలోనే నిర్వహించారు.
సుభాష్‌నగర్, ఆగస్టు 31: తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అర్బన్ ఏఎన్‌ఎంలు రాఖీ పండుగను శిబిరంలోనే నిర్వహించారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 2/2023 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌కు రాఖీలు కట్టి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ముదం రమాదేవి, సంపూర్ణ, స్వరూప, సంతోష, స్రవంతి, మానస, సంధ్య, రజిత, పుష్పలత, సులోచన, వరలక్ష్మి, సంధ్య, నిర్మల, ముబిన్ పాల్గొన్నారు.