గులాబీ జెండా ఎగురవేయాలి
ABN , First Publish Date - 2023-09-22T23:49:18+05:30 IST
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 22: రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్‌లోని 11వ డివిజన్‌లో బస్తీనిద్ర, ప్రజా అంకితయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. రామగుండానికి మెడికల్ కళాశాల, సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం తీసుకువచ్చానని, పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ బంగి అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు తోడేటి శంకర్‌గౌడ్, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, పర్లపల్లి రవి, వడ్డేపల్లి క్రాంతి, కోడి రామకృష్ణ, సట్టు శ్రీనివాస్, రమ్యయాదవ్ పాల్గొన్నారు.