గ్రామీణ స్థాయిలో సమస్యలను అధ్యయనం చేయాలి

ABN , First Publish Date - 2023-03-05T01:14:38+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

గ్రామీణ స్థాయిలో సమస్యలను అధ్యయనం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 4: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అఖిల భారత సర్వీస్‌ శిక్షణ కోసం వచ్చిన 20 మంది అధికారులతో శనివారం కలెక్టర్‌ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కేటాయించిన గ్రామాల వివరాలను, నోడల్‌ అధికారి వివరాలను అందించారు. ఈ నెల 10వ తేదీ వరకు ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లి గ్రామాలను కేటాయించారు. ఆయా మండలాల ఎంపీడీవోలతో గ్రామాలకు పంపించారు. శిక్షణ అధికారులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా నోడల్‌ అధికారిలుగా డీఆర్‌డీవో, సీపీవో, డీపీవో, అడిషనల్‌ డీఆర్‌డీవో, ఎపీడీ, ఎంపీడీవోలు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి రీజినల్‌ కో ఆర్డినేటర్‌ భిక్షపతిని నియమించారు.

Updated Date - 2023-03-05T01:14:38+05:30 IST