బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-08-07T01:06:15+05:30 IST

మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు.

 బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం
క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

ఇల్లంతకుంట, ఆగస్టు 6: మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు మాట్లాడుతూ ప్రజల్లో రసమయి బాలకిషన్‌కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్‌ నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ విషం చిమ్ముతున్నారన్నారు. నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియని నాయకుడు ఎవరో రాసిచ్చిన దానిని చదువుతున్నారని విమర్శించారు. శవ రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తకాదని, ప్రజలు వారిని నమ్మేస్థితిలో లేరని అన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు పల్లె నర్పింహరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మామిడి సంజీవ్‌, ప్యాక్స్‌చైర్మన్‌ తిరుపతిరెడ్డి, సెస్‌డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, ప్యాక్స్‌వైస్‌చైర్మన్‌ తిరుపతి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మిబాలరాజు, ఎంపీటీసీ నర్సయ్యయాదవ్‌, నాయకులు రమేష్‌, రాజయ్య, ఉస్మాన్‌, రఘు, ముబీన్‌, భాస్కర్‌, తిరుపతి, శంకర్‌, కిషోర్‌, వెంకన్న, దుర్గయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-08-07T01:06:15+05:30 IST