విష జ్వరాల పంజా..

ABN , First Publish Date - 2023-03-19T00:32:13+05:30 IST

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఇటీవల రాత్రి, పగటి వాతావరణంలో చోటుచేసుకుం టున్న మార్పుల కారణంగా చిన్న పిల్లలు, పెద్దలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.

 విష జ్వరాల పంజా..

- వాతావరణంలో మార్పులు..

- రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు

- జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ

జగిత్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఇటీవల రాత్రి, పగటి వాతావరణంలో చోటుచేసుకుం టున్న మార్పుల కారణంగా చిన్న పిల్లలు, పెద్దలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా టైఫాయిడ్‌, మలేరియా, చికెన్‌ ఫాక్స్‌, శ్వాసకోస సంబంధిత, డయేరియా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఫిబ్ర వరి రెండోవారం నుండి సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని, వాతావరణ మార్పులతో పిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతు న్నారు. రెండు, మూడు రోజులుగా వాతావరణం చల్లబడటం, చల్లని గాలు లు వీయడం వంటి కారణాలతో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు దోమలు విజృంభించడంతో సమస్య తీవ్రమవుతోందని ప్రజలు భయపడుతున్నారు.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ..

జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజురోజుకూ ఓపీ పె రుగుతోంది. దగ్గు, జలుబు సమస్య పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరల్‌ జ్వరం నాలుగైదు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నా దగ్గు, జలుబు మాత్రం రెండు వారాలు పైగా తీవ్రత చూపిస్తోంది. ఈ క్రమంలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి ప్రతీ రోజు 900 వరకు ఓపీ కేసు లు నమోదు అవుతున్నాయి. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు 1500 నుంచి 2000 వరకు ఓపీ నమోదు అవుతోంది. ఇందులో 150 నుంచి 200 వరకు జ్వరాలతో చిన్న పిల్లలు ఆసుపత్రికి వస్తున్నారు. నిత్యం 200కు పైగా రక్త నమూనాల పరీక్షలు చేస్తున్నారు. అయితే జ్వర పీడితుల్లో వివిధ లక్షణాలు కనిపిస్తుండటం వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇష్టానుసారంగా పరీక్షలు..

జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారు జ్వర భాధితులు మాత్రమే ఉంటున్నారు. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలు జ్వరాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రులకు పరుగు తీస్తున్నారు. గత వారం, పది రోజులుగా ఏ ఆసుపత్రి చూసినా నిత్యం సాధారణం కంటే ఎక్కువగా ఓపీలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అవ సరం ఉన్నా లేకున్నా రక్తం, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో అడ్మిట్‌ చేసుకొని రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా మందులు రాస్తూ ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

లక్షణాలు ఇవే...

కరోనా వైరస్‌ సృష్టించిన అలజడి ప్రజలు ఇప్పటికి మర్చిపోలేక పోతు న్నారు. ఈ క్రమంలో వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ను తేలికగా తీసుకోకపో వడమే మంచిది. ఈవైరస్‌ వల్ల నిరంతరం దగ్గు, జ్వరం, జలుబు శ్వాసకోస సమస్యలు ఉంటాయి. ప్లూ లక్షణాలు ఉన్నవారు ఇతరులతో చేతులు కల పడం, అలింగనం చేసుకోవడం కలిసి భోజనం వంటివి చేయకూడదు. తరు చుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ప్రస్తుతం విషజ్వరాలు విజృంభిస్తు న్నాయి. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ ఫాక్స్‌ శ్వాసకోస వ్యాధు లు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. నెల రోజుల్లోనే ఈ కేసులు అధికంగా వచ్చినట్లు వైద్య వర్గాలు అంటున్నాయి. సరైన సమయంలో ఆసు పత్రికి వచ్చే పిల్లలు త్వరగా కోలుకుంటున్నారని, నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మెరుగైన వైద్యం అందిస్తున్నాం

- డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

జిల్లాలో ఆసుపత్రులకు వివిధ జబ్బులతో వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాము. దగ్గు, జలుబు జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. చాలా రోజులుగా కరోనా కేసులు నమోదు కావ డం లేదు. కొత్త వేరియంట్లు వస్తున్నప్పటికి ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు వైద్యులు సలహాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయి.

Updated Date - 2023-03-19T00:32:13+05:30 IST