అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం

ABN , First Publish Date - 2023-04-15T00:52:53+05:30 IST

ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పాషిగామ గ్రామస్థులు అంబేడ్కర్‌ విగ్రహానికి శుక్రవారం వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.

అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం
పాషిగామలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న పాషిగామ గ్రామస్థులు

- ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాషిగామ గ్రామస్థుల నిరసన

వెల్గటూర్‌, ఏప్రిల్‌ 14: ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పాషిగామ గ్రామస్థులు అంబేడ్కర్‌ విగ్రహానికి శుక్రవారం వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా స్తంభంపల్లి శివారులోని 1090 సర్వే నంబరు గల భూమిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేలా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా చూడాలని వినతి పత్రంలో కోరారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే నాయకుల నీడన నివసిస్తున్నామని పేర్కొన్నారు. జనావాసాల మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విషపూరిత ఇథనాల్‌ పరిశ్రమను ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణా నికి పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రా ణాలకు హాని కలిగించే ఇథనాల్‌ పరిశ్రమ జనావాసాల మధ్య నిర్మించవద్దని ఉద్యమిస్తున్నప్పటికీ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పరిశ్ర మ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని వాపోయారు. రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకొని, ప్రజాప్రతినిధుల మనసులు మారేలా చేసి, రాజ్యాంగ విలువలను కాపాడి, విషపూరిత ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపి వేసేలా చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో అంబేడ్కర్‌ను వేడుకున్నారు.

Updated Date - 2023-04-15T00:52:53+05:30 IST