Share News

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:49 PM

ప్రజా పాలన కార్యక్రమా న్ని సద్వినియోగం ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 31: ప్రజా పాలన కార్యక్రమా న్ని సద్వినియోగం ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని కొదురుపాక గ్రామంలో రూ.12.5 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ, రూ.25లక్షలతో నిర్మించిన గ్రామపం చాయతీ భవనాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఆరు గ్యారంటీ పథకాల ప్రయోజనాలను కల్పించడం లో అధికారులు, ప్రజాప్రతినిదులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, నిరుపేదలకు అర్హులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకు రెండు ప్రధానమైన స్కీం లను అమలుచేశామని, మిగతా వాటిని కూడా అమలు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు ఈనెల 6 వరకు పంచాయతీల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని, తర్వాత మండల కార్యాలయాల్లో సైతం ఇచ్చుకోవచ్చన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయని ఇందులో ఎలాంటి అపోహలకు పెట్టుకోవద్ద న్నారు. ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో పేదలను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. కొదురుపాక - పెద్దపల్లి రోడ్డులో ఉన్న హుస్సేనిమియా వాగుపై హైలెవెల్‌ వంతన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి..

సుల్తానాబాద్‌ మండలం మూడేళ్ల కిందట రూర్బన్‌ పథ కం కింద ఎంపిక కాబడి కోట్లాది రూపాయల నిధులురాగా అందుకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటి వివరాలను తాను అధికారల ద్వారా సేకరించాన న్నారు. అధికారులతో సమీక్ష జరిపి మిగిలిపోయిన, అసం పూర్తిగా ఉన్న రూర్బన్‌ పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించడం జరిగిందని అధికారు లను కూడా ఆదేశించామన్నారు. లేనిచో నిధులు మురిగి పోయే ప్రమాదం ఉందన్నారు. రైస్‌మిల్లర్లతో మాట్లాడి ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలుకు చర్యలు తీసకుం టామన్నారు. సర్పంచ్‌ దేవరనేని సాగర్‌రావు, ఎంపీపీ బాలాజీరావు మాట్లాడుతూ కొదురుపాక గ్రామానికి కావా ల్సిన పలు అభివృద్ది పనులను మంజూరి చేయించాలని ఎమ్మెల్యేకు సూచించారు. కాగా, సర్పంచ్‌ ఎంపీపీలు ఎమ్మె ల్యేను ఘనంగా సన్మానించారు. జీపీ బిల్ఢింగ్‌ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన దళితులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మిను పాల స్వరూపప్రకాశ్‌రావు, సర్పంచ్‌ సాగర్‌రావు, బండారి రమేష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ లు మహేందర్‌, రామారావు, రాజాగౌడ్‌, హరీష్‌, జ్యోతి, అంతటి అన్నయ్యగౌడ్‌, దామోదర్‌రావు, చిలుక సతీష్‌, ఎం పీవో ఫయాజ్‌, ఏఈ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం..

సుల్తానాబాద్‌ పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో ఎమ్మెల్యే విజరమణారావును ఆర్యవైశ్య సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షు డు కొమురవెళ్లి బాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:49 PM