పెన్షనర్లకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:14 AM
పెన్షనర్స్‌కు ఆర్థిక స్వాతంత్రం ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
సుభాష్‌నగర్, డిసెంబరు 17: పెన్షనర్స్‌కు ఆర్థిక స్వాతంత్రం ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో కేంద్ర పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి కేశవరెడ్డి కార్యదర్శి ఎలదాసరి లింగయ్య ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్షనర్లను సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెన్షనర్స్‌కు 60 సంవత్సరాలు ఉన్నప్పటికి మానసికంగా, శారీరకంగా 20 సంవత్సరాల వయస్సు వారిలా ఉండాలన్నారు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నపుడే ప్రతి మనిషికి విలువ ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, ఎంఏ హమీద్, సుద్దాల రాజయ్య, రాగి శ్రీనివాస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, హర్మిందర్‌సింగ్, మారుపాక రాజేశ్ పాల్గొన్నారు.