Share News

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:15 AM

గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లిం చాలని ఇల్లంతకుంట మండల సర్పం చులు కోరారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 13 : గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లిం చాలని ఇల్లంతకుంట మండల సర్పం చులు కోరారు. బుధవారం కలెక్ట రేట్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ మాట్లాడుతూ పంచా యతీలకు రావాల్సిన అర్ధిక సంఘం నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో పనులను చేపట్టలేక పోతున్నామ న్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన దశాబ్ధి ఉత్పవాల సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సైతం బిల్లులు రాలేదన్నారు. అధికారులు ఒత్తిడి చేసి గ్రామాల్లోని పనులు చేయించారని, వాటికి సంబంధించిన బిల్లులను ఇవ్వాలంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బిల్లులు తమ పరిధిలోకి రావంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండలంలో చేపట్టిన మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై సంబంధిత జిల్లా అధికారులను కలిసి అడిగితే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని, పెండింగ్‌ బిల్లును ఇప్పించాలని కోరారు. సర్పంచులు మాల్లారెడ్డి, జితేందర్‌గౌడ్‌, మత్యం అమర్‌, బిల్లవేణి పర్శరాం, శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి, ముస్కు మల్లయ్య, మల్లుగారి వాణి, భాగ్యలక్ష్మీ, శ్రీలతరెడ్డి, శిరీష, లక్ష్మీ, మల్లవ్వ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:15 AM