Share News

పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:57 PM

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా  పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌

చొప్పదండి, డిసెంబరు 24: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గుమ్లాపూర్‌లో మండల స్థాయి బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత సాధ్యం కాని, వారంటీలేని ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్నా గ్యారెంటీలను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. క్రాంగెస్‌ ప్రభుత్వ హయాంలో 3 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదికి పదివేల మంది డాక్టర్లను సిద్థం చేసేవిదంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేశారని చేశారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఐదేళ్లుగా పార్లమెంట్‌ నియోజకవర్గంలో నయాపైసా అభివృద్ధి చేయలేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌, పాక్స్‌ చైర్మెన్‌ మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మెన్‌ చుక్కారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సాంబయ్య, వినయ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:57 PM