పాత పెన్షన్‌ వర్తింప చేయాలి

ABN , First Publish Date - 2023-06-26T00:32:58+05:30 IST

ఉద్యోగ ఉపాఽధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింప చేయాలని డీఎస్సీ-2003 పాత పెన్షన్‌ పోరాట సమితి నాయకులు కోరారు.

పాత పెన్షన్‌ వర్తింప చేయాలి
మారం జగధీశ్వర్‌, దారం శ్రీనివాస్‌రెడ్డిలకు వినతిపత్రం అందచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

సుభాష్‌నగర్‌, జూన్‌ 25: ఉద్యోగ ఉపాఽధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింప చేయాలని డీఎస్సీ-2003 పాత పెన్షన్‌ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిప్రతం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1 నవంబరు 2004కు ముందు నియమక ప్రక్రియ మొదలైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్‌ అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ విధానంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతమన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు గుంటి వేణుగోపాల్‌, నల్ల రాజేందర్‌రెడ్డి, నడిపెల్ల సంతోష్‌కుమార్‌, కిషన్‌, రఘుబాబు, లక్ష్మన్‌, మాధవచారి, రామ్‌కిరణ్‌, కిరణ్‌, వీరేందర్‌, శ్యామ్‌రాజ్‌ పాల్గోన్నారు.

Updated Date - 2023-06-26T00:32:58+05:30 IST