మార్చి 6 నుంచి ఓబీ కార్మికుల సమ్మె
ABN , First Publish Date - 2023-02-21T00:38:24+05:30 IST
రామగుండం రీజియన్ పరిధిలో పని చేస్తు న్న ఓబీ కాంట్రాక్టు కార్మికులు మార్చి 6 నుంచి సమ్మె చేయనున్నారు. ఈ మేరకు ఓబీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియా ల అధికారులకు, పీసీ పటేల్, ఆర్వీఆర్, సుశీ ఇన్‌ఫ్రా, హెచ్‌డీ కంపెనీల ప్రతినిధు లకు సమ్మె నోటీస్ అందజేశారు.
యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 20: రామగుండం రీజియన్ పరిధిలో పని చేస్తు న్న ఓబీ కాంట్రాక్టు కార్మికులు మార్చి 6 నుంచి సమ్మె చేయనున్నారు. ఈ మేరకు ఓబీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియా ల అధికారులకు, పీసీ పటేల్, ఆర్వీఆర్, సుశీ ఇన్‌ఫ్రా, హెచ్‌డీ కంపెనీల ప్రతినిధు లకు సమ్మె నోటీస్ అందజేశారు. ప్రతి ఏడాది ఓబీ కంపెనీలు జీతభత్యాలపై చర్చించి ఒప్పందాలు చేసుకోవాల్సి ఉన్నా మూడేళ్లుగా జీతాలు పెంచలేదని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కోల్ ఇండియా వేతనాలను ఓబీ కార్మికులకు అమలు చేయాలని, ప్రైవేట్ ఓబీల్లో స్థానిక కార్మికులకే ఉపాధి కల్పించా లని, కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 25 మస్టర్లు దాటితే గుడ్‌విల్ కింద డ్రెవర్‌కు వెయ్యి, హెల్పర్‌కు రూ. 500 చెల్లిం చాలని, ప్రతి కార్మికుడికి మెడికల్ వీటీసీ బిల్లు లు కంపెనీయే చెల్లించి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివా రం డ్యూటీ చేసే కార్మికుడికి రెండు మస్టర్లు కట్టి ఇవ్వడంతో పాటు మరో రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుడి చికిత్స కోలుకునే వరకు చికిత్స అందించాలని, అతడిని విధుల్లో నుంచి తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ నాయకు లు సమ్మె నోటీస్‌లో డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించుకుంటే సమ్మెకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా యాజమా న్యాలు చర్చలకు ముందుకు రావాలని కోరారు. సమ్మె నోటీస్ ఇచ్చిన వారిలో కౌశిక హరి, బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి, ఏ వెంకన్న, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్, కే సతీష్, రమేష్ ఉన్నారు.