జిల్లాకు ముఖద్వారంగా నుస్తులాపూర్
ABN , First Publish Date - 2023-01-23T00:26:16+05:30 IST
జిల్లాకు నుస్తులాపూర్ గ్రామం ముఖద్వారం కానుందని, నుస్తులాపూర్ అభివృద్దికి కావల్సిన నిధులు మంజురు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
తిమ్మాపూర్, జనవరి 22: జిల్లాకు నుస్తులాపూర్ గ్రామం ముఖద్వారం కానుందని, నుస్తులాపూర్ అభివృద్దికి కావల్సిన నిధులు మంజురు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన గ్రామా పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేసే వాళ్లను, చేయని వాళ్లను ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో ఎక్కడైనా ఉన్నయా అని ప్రశ్నించారు. ప్రజల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, అబండాలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నుస్తులాపూర్ గ్రామం జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకుని అభివృద్ధిలో దూసుకుపోతోందని, సర్పంచ్ రావుల రమేష్ సొంత డబ్బులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారని అభినందించారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామంతో పాటు, నుస్తులాపూర్ నుంచి నల్లగొండ గ్రామం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తమను ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువగా పని చేస్తామన్నారు. అనంతరం రమేషన్న పథకం కింద అర్హులైన వారికి 5,116 రూపాయల బాండ్‌లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎల్‌పీ కార్యదర్శి మాదాడి రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సర్పంచ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఇనుకొండ జితేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ బేతి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.