ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
ABN , First Publish Date - 2023-07-04T23:59:51+05:30 IST
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ పనులు పురోగతిలో ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
ముస్తాబాద్, జూలై 4: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ పనులు పురోగతిలో ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ముస్తాబాద్‌లోని కస్తూర్బా పాఠశాల, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, బందనకల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం పరిశీలించారు. బందనకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన పనులపై అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ రూం, ఎలక్ట్రికల్ వర్క్ వంటి పనులు ఇప్పటికే పూర్తి చేయగా సంప్, డ్రింకింగ్ వాటర్ వంటి పలు పెండింగ్ పనులను నెలఖారులోగా పూర్తి చేయాలని, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గత సంవత్సరం కంటే విద్యార్థుల సంఖ్య తగిగందన్నారు. విద్యార్థులకు వారంలో మూడు సార్లు కోడి గుడ్డు ఇవ్వాల్సి ఉండగా అధిక ధరలతో ఇవ్వడం లేద ని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి ఎగ్ సప్లయర్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి రేపటి నుంచి అందేలా చూడాలన్నారు. వినకపోతే సప్లయర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అంతకుముందు ముస్తాబాద్ మండల కేంద్రంలోని కెజీబీవి పాఠశాల, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశా రు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల బారిన పడే అవ కాశం ఉందని ప్రిన్స్‌పాల్‌లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. కేజీబీవీలో ఉన్న ఒక్క డార్మెటరీ విద్యార్థులకు సరిపోవడం లేదని ఎస్‌వో శ్రీలత, కలెక్టర్‌కు విన్నవించగా అదనంగా ఒకటి మం జూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గురుకులంలో మౌలిక సదుపాయాల కోసం రూ.5.9 లక్షలను మంజూరు చేశామన్నారు. బందనకల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ప్రత్యేక కార్యక్రమం అమలు, ఘన ద్రవ్య వ్యర్థాల సమర్థ నిర్వహణను తీసుకుంటున్న చర్యలను కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ నెలఖారులోగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. డీఈవో రమేశ్, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీవో రమాదేవి, ప్రిన్స్‌పాల్ ఉదయ్‌రెడ్డి, ఎస్‌వో శ్రీలత, హెచ్‌ఎంలు రవి, విఠల్‌నాయక్, ఎంపీటీసీ రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి , చిగురు నరేశ్ పాల్గొన్నారు.
గోదాము తనిఖీ
ముస్తాబాద్ సహకార సంఘం గోదామును కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువులు, విత్తనాల స్టాక్ జాబితాను పరిశీలించారు. విక్రయాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలన్నారు. ఏవో వెంకటేశ్, సీఈవో అనమేని బాలయ్య, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.