‘ఖని’ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎన్టీపీసీ డైరెక్టర్లు

ABN , First Publish Date - 2023-06-26T00:35:27+05:30 IST

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించించేందుకు ఎన్‌టీపీసీ యాజమాన్యం కృషి చేస్తోందని ఎన్‌టీపీసీ డైరెక్టర్‌ విద్యాధర్‌ వైశ్యమ్‌పాయన్‌, జితేందర్‌ జయంతిలాల్‌ టన్న, సంగిత్‌ వారియర్‌, రామగుండం ఈడీ సునీల్‌ కుమార్‌ చెప్పారు.

‘ఖని’ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎన్టీపీసీ డైరెక్టర్లు

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 25: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించించేందుకు ఎన్‌టీపీసీ యాజమాన్యం కృషి చేస్తోందని ఎన్‌టీపీసీ డైరెక్టర్‌ విద్యాధర్‌ వైశ్యమ్‌పాయన్‌, జితేందర్‌ జయంతిలాల్‌ టన్న, సంగిత్‌ వారియర్‌, రామగుండం ఈడీ సునీల్‌ కుమార్‌ చెప్పారు. ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని వారు సందర్శించారు. ఏడాది క్రితం ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.6.78కోట్లతో నిర్మించిన రెండవ అంతస్థు భవనంలో ఏర్పాటు చేసిన వివిధ వార్డులను, కార్యాలయాలను, ఐసీయూ రూములను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎన్‌టీపీసీ సహకారం ఎళ్లప్పుడూ ఉంటుందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని వారు సూచించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ఎన్‌టీపీసీ సహకారం ఎళ్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ఇటీవల ఆసుపత్రిలోని పరికరాల కొనుగోలుకు ఎన్‌టీపీసీ యాజమాన్యం రూ.1.5కోట్లు మంజూరు చేసింది. డైరెక్టర్లకు ఆర్‌ఎం వో భవ్య, వైద్యులు రాజశేఖర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారి నిశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:35:27+05:30 IST