గడువులోపు గగనమే..!
ABN , First Publish Date - 2023-01-29T01:00:33+05:30 IST
జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యం చేరడం గగనంగా తయారయింది. సీఎంఆర్ విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఇంకా చా లా మిల్లులు నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్నాయి.
- ఈనెలాఖరు వరకు ముగియనున్న గడువు
జగిత్యాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యం చేరడం గగనంగా తయారయింది. సీఎంఆర్ విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఇంకా చా లా మిల్లులు నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఈ నెల మొదటి వా రంలోనే పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యా లకు లేఖలు కూడా రాసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వందశాతం బియ్యం అప్పగించాల్సిందే అని అందులో పే ర్కొన్నారు. ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన దృష్ట్యా మరోసారి పెం చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్ని మిల్లుల యా జమాన్యాలు పెద్ద ఎత్తున బియ్యం బకాయిపడ్డాయి. దీంతో అధికారులు ఆఖరు సమయంలో ఒత్తిడి పెంచటంతో పాటు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు.
జగిత్యాల జిల్లాలో సీఎంఆర్ పరిస్థితి ..
జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్‌లో 72 రా రైస్ మిల్లులకు, 63 ఫారా బాయిల్డ్ రైస్ మిల్లులకు అధికారులు 3,25,444 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కేటాయించారు. ఇందులో ఫారా బాయిల్డ్ రైస్ మిల్లులకు 1,57, 949 మెట్రిక్ టన్నులు, రా రైస్ మిల్లులకు 1,67,495 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కేటాయించారు. జిల్లాలో ఇప్పటివరకు 2,59,561 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ అప్పగించారు. మిగిలిన 65,883 మె ట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన 44,008 మెట్రిక్ టన్నుల బి య్యం అప్పగించాల్సి ఉంది. జిల్లాలో వానాకాలం సీఎంఆర్ లక్ష్యం 80 శా తం మాత్రమే పూర్తయింది. ఈనెలాఖరు వరకు మరో 20 శాతం పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువుకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో వంద శాతం లక్ష్యం పూర్తి చేయడం గగనంగా మారింది. అదేవిధంగా 2021-22 యాసంగి సీజన్‌లో జిల్లాలోని 62 రా రైస్‌మిల్లుల కు, 62 ఫారా బాయిల్డ్ రైస్ మిల్లులకు 2,70,776 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని అధికారులు కేటాయించారు. ఇందులో ఫారా బాయిల్డ్ రైస్ మి ల్లులకు 2,30,056 మెట్రిక్ టన్నులు, రా రైస్ మిల్లులకు 40,720 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 1,29,221 మె ట్రిక్ టన్నుల ధాన్యానికి సంబందించిన సీఎంఆర్‌ను రైస్ మిల్లర్లు అప్ప గించారు. మిగిలిన 1,41,555 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన 94,842 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ 48 శాతం పూర్తయింది.
సీఎంఆర్‌లో ఆలస్యం..
గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గడువు ఇదివరకే ముగిసింది. అయితే మిల్లుల యాజమాన్యాలు కోరిన నేపథ్యంలో రెండు పర్యాయాలు గడువును పొడగించారు. గత యాసంగి సీజన్‌కు కూడా గ డువు దగ్గరపడుతోంది. అయితే దీనికి మరోమారు పెంచేందుకు అవకా శం ఉండడంతో మిల్లుల యజమాన్యాల జోలికి వెళ్లడం లేదని సివిల్ సప్లయి అధికారులు అంటున్నారు. దీనికి తోడు యాసంగి విషయంలో కేంద్రం, రాష్ట్రం మద్య ధాన్యం సేకరణ వ్యవహారంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లులకు కేటాయింపు, వాటిని తిరిగి ఎఫ్‌సీఐ సేకరణ ప్రారంభంలో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో సీఎంఆర్ అప్పగిం చడానికి కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నా రు. కానీ వానాకాలం విషయంలో ఇప్పటికే ఆలస్యం అవడంతో అధికారు లు ఒత్తిడి పెంచుతున్నారు.
ఇతర మిల్లుల తరలింపు...
సీఎంఆర్ గడువులోపు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి పెంచినప్పటికీ కొందరు మిల్లర్లలో మార్పు కనిపించడం లేదు. బకాయిలు లక్ష్యానికి దూ రంగా ఉన్నారు. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి మిల్లుల నుంచి ధాన్యాన్ని, లక్ష్యం పూర్తి చేసిన మిగితా మిల్లుల్లోకి మళ్లించాలని నిర్ణయిం చారు. ఈమేరకు అదనపు కలెక్టర్ బీఎస్ లత మిల్లర్లతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచించారు. ఈ ప్రక్రియను ప్రారంభించి లక్ష్యం పూర్తి చేసిన సుమారు పదిహేను రైస్ మిల్లులకు ధాన్యం తరలించి గా నుగాడిస్తున్నారు. తరలింపు ఖర్చులను సరైన పనితీరు కనబరచని మి ల్లుల యజమానులపై వేటు వేయడానికి యోచిస్తున్నారు. సంబంధిత రైస్ మిల్లులకు భవిష్యత్తులో సీఎంఆర్ కేటాయింపులు ఇచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా ధాన్యం నిల్వలు త క్కువగా ఉన్న మిల్లులపై సైతం అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుత యేడాది జిల్లాలో రెండు రైస్ మిల్లులను గుర్తించి నిషేదిత జాబితాలో పెట్టారు.
గడువులోపు పూర్తి చేయాల్సిందే..
- చందన్ కుమార్, జిల్లా సివిల్ సప్లయి అధికారి
జిల్లాలో సీఎంఆర్ లక్ష్యాన్ని మిల్లర్లు పూర్తి చేయాల్సిందే. 2021-22 వా నాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గడువు ఈనెలాఖరుతో ము గుస్తోంది. జిల్లాలో దాదాపుగా 80 శాతం సీఎంఆర్ పూర్తయింది. ఎప్ప టికప్పుడు సమావేశాలు నిర్వహిస్తుండడం, నోటీసులు ఇస్తుండడం వంటి వి చేపడుతూ సీఎంఆర్ పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటాము.