Share News

జాతీయ సంఘాలవి మోసపూరిత విధానాలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:20 AM

కార్మికుల హక్కుల సాధనలో జాతీయ సంఘాలు మోసపూరిత విధానాలను అమలు చేసిందని టీబీజీకేఎస్‌ జనరల్‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శనివారం ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఏఎల్‌పీలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

జాతీయ సంఘాలవి మోసపూరిత విధానాలు
సమావేశంలో మాట్లాడుతున్న మిర్యాల రాజిరెడ్డి

- టీబీజీకేఎస్‌ జనరల్‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి

రామగిరి, డిసెంబరు 16: కార్మికుల హక్కుల సాధనలో జాతీయ సంఘాలు మోసపూరిత విధానాలను అమలు చేసిందని టీబీజీకేఎస్‌ జనరల్‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శనివారం ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఏఎల్‌పీలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమానికి అనేక హక్కులు సాధించామన్నారు. సింగరేణి చరిత్రలో లేనివిధంగా నేరుగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసిఆర్‌దేనని పేర్కొన్నారు. రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లుకు జనరల్‌ మజ్ధూర్‌ ప్రమోషన్స్‌ కల్పించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కిందన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం సదుపాయం కల్పించామన్నారు. జాతీయ సంఘాలు ద్వారా కోల్పోయిన హక్కులను టీబీజీకేఎస్‌ తిరిగి సాధించిందన్నారు. దేశంలో కోల్‌బ్లాక్‌లలో ఎక్కడా ఇలాంటి పథకాలు సాధించారో వాకబు చేయాలని సూచించారు. కార్మికులపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా కార్మికులకు రావాల్సిన అలవెన్సులను ఎందుకు ఫ్రీజ్‌ చేశారని ఆరోపించారు. టీబీజీకేఎస్‌ తోనే హక్కులను సాతిధించగలుగుతామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గౌతం శంకరయ్య, పర్శ బక్కయ్య, సంపత్‌రెడ్డి, దాసరి మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:20 AM