Share News

బండి సంజయ్‌ని కలిసిన ముథోల్‌ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-12-10T23:26:22+05:30 IST

ముథోల్‌ శాసనసభ్యుడు రామారావుపటేల్‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండిసంజయ్‌కుమార్‌తో ఆదివారం భేటీ అయ్యారు.

 బండి సంజయ్‌ని కలిసిన ముథోల్‌ ఎమ్మెల్యే

భగత్‌నగర్‌, డిసెంబరు 10: ముథోల్‌ శాసనసభ్యుడు రామారావుపటేల్‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండిసంజయ్‌కుమార్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ముథోల్‌తో బండి సంజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. బైంసా అల్లర్ల నేపథ్యంలో బండి సంజయ్‌ నియోజకవర్గంలో పర్యటించారు. బాధితులకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ముథోల్‌లో పాదయాత్ర చేయడంతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్‌లో ముథోల్‌ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన రామారావు పటేల్‌ మర్యాదపూర్వకంగా ఎంపీ బండి సంజయ్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో వీరు అరగంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-12-10T23:26:54+05:30 IST