సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2023-03-26T00:15:06+05:30 IST

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి

పెద్దపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీపీ ఆర్‌ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీ వల కాలంలో చాలా మంది గుండెపోటుతో మర ణిస్తున్నారని, యువకులు కూడా మరణించడం విచారకరమని అన్నారు. ఆకస్మిక గుండెపోటు వచ్చిన సమయంలో సీపీఆర్‌ చేయడం వల్ల ప్రా ణాలు సంరక్షించే అవకాశాలు 50శాతం మెరుగ వుతాయన్నారు. సీపీఆర్‌ చేసే విధానం, దాని వాల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించి పకడ్బందీగా అమలుచేస్తున్న దని ప్రతిఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన పెంచుకుని ఇతరులకు తెలియజేయాలని, సీపీ ఆర్‌ చేసి ఒక మనిషిని కాపాడడం వల్ల వారి కుటుంబానికి సైతం మేలు చేసిన వారమవుతామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు విప్లవా త్మక మార్పులు తీసుకవస్తూ దేశానికి ఆదర్శంగా నిలుపుతు న్నారని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 57 పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు టి-డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నిర్మించిన కేంద్రం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సంగీతసత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మహిళా కమిషన్‌ సభ్యురాలు కఠారి రేవతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుక, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:15:06+05:30 IST