పోలింగ్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2023-11-21T23:17:47+05:30 IST
పోలింగ్ నిబంధనలపై అధికారుల్లో సంపూర్ణ అవగాహన అవసరమని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు.

రామగిరి, నవంబరు 21: పోలింగ్ నిబంధనలపై అధికారుల్లో సంపూర్ణ అవగాహన అవసరమని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. మంగళ వారం జేఏన్టీయూలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలను వివరిం చారు. అనంతరం కళాశాలలోని పోలింగ్ అధికారులకు అం దిస్తున్న అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. నవంబరు 30న జరిగే పోలింగ్‌ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్మకాలపై సంపూర్ణంగా అవగాహన పెంపొం దించుకోవాలని సూచించారు. పోలింగ్ అధికారులు అందిం చిన హ్యండ్ బుక్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నారు. గతంలో అనేకమార్లు పో లింగ్ విధులు నిర్వహించినప్పటికి ప్రతిఎన్నిక ప్రత్యేకంగానే ఉంటుందన్నారు. నిబంధనల్లో మార్పులు ఉంటాయని నిర్ల క్ష్యంగా వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వ హించాల్సిందిగా సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురె ౖన సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్, అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్ర సాద్‌లాల్, రిటర్నింగ్ అదికారి హనుమానాయక్, తహసీల్దా ర్‌లు రాజ్‌కుమార్, కుమారస్వామి, రామ్‌మోహన్‌రావు, తది తరులు పాల్గొన్నారు.