మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2023-03-26T00:14:49+05:30 IST

మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి దేశ ప్రజలను కోరారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి
జగిత్యాలలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, నాయకులు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, మార్చి 25: మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి దేశ ప్రజలను కోరారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధిరా భవన్‌ నుండి తహసీల్‌ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, ప్రధాన రహదారిపై భైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. అనంతరం మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని యావత్‌ భారత దేశం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న పాలకులకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రశ్నించే వారి నొక్కుతూ, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. భారత దేశ ప్రజల ఆస్తులను పీఎం మోదీ తన ఆప్త మిత్రుడు అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. సభ్యత్వం రద్దు చేసినా రాహుల్‌ గాంధీ ఊరుకోరని ప్రజల పక్షాన ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరు చేస్తారన్నారు. అవినీతికి పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌, నీరవ్‌ మోదీలను ఎందుకు రప్పించలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్థిక నేరాలపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయాలని ఒత్తిడి తెస్తే రాహుల్‌ గాంఽధీ సభ్యత్వాన్ని కుట్ర పూరితంగా రద్దు చేశారని ఇది ప్రజాస్వామ్యానికే చీకటి రోజన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు కమటాల శ్రీనివాస్‌, గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, వీరబత్తిని శ్రీనివాస్‌, కల్లెపెల్లి దుర్గయ్య, రాధాకిషన్‌ రావు, నక్క జీవన్‌, పులి రాము, గుండ మధు, మన్సూర్‌, నేహాల్‌, చాంద్‌ పాష, రఘవీర్‌, గోపి, మహిపాల్‌ , రమేష్‌ బాబు, తదితరులు ఉన్నారు.

పెగడపల్లిలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం

పెగడపల్లి, మార్చి 25 : పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీని లోక్‌సభ నుండి పంపించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మండలశాఖ ఆద్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్‌ కూడలి వరకు కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి , ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుర్ర రాములుగౌడ్‌, లింగాపూర్‌ సర్పంచ్‌ ఈరెల్లి శంకర్‌, నాయకులు తడగొండ రాజు, చాట్ల విజయభాస్కర్‌, పూసాల తిరుపతి, మల్లేశం, ప్రవీణ్‌ కుమార్‌, మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:14:49+05:30 IST