దేశాన్ని విశ్వగురువుగా మలిచిన ఘనత మోదీదే
ABN , First Publish Date - 2023-06-24T00:06:42+05:30 IST
ప్రపంచ పటంలో భారత దేశాన్ని విశ్వగురువుగా మలిచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు
మహజన్ సంపర్క్ అభియాన్ సందర్భంగా బీజేవైయం బైక్‌ర్యాలీ
జగిత్యాల అర్బన్, జూన్ 23: ప్రపంచ పటంలో భారత దేశాన్ని విశ్వగురువుగా మలిచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ నుంచి బీజేవైయం ఆధ్వ ర్యంలో బైక్‌ర్యాలీని ఏర్పాటు చేయగా, జెండా ఊపి ర్యాలీని ప్రారంభిం చారు. అనంతరం సత్యనారాయణ రావు మాట్లాడుతూ మహాజన్ సంప ర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల పాటు వివిధ కార్యక్ర మాల నిర్వహణకు బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చిందన్నారు. దీనిలో భా గంగా యువమోర్చ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీని నిర్వహించామన్నారు. తొ మ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, నరేంద్ర మోదీ పాలనలో దేశం సవాళ్లు ఎదు ర్కొంటూనే సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. తొ మ్మిదేళ్ల మోదీజీ పాలన విజయాలను గడప, గడపకు వివరిస్తూ ప్రజ లను చైతన్యపరుస్తామన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ప్రజల ఆశీర్వాదంతో పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నా మ న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, జి ల్లా మహిళామోర్చ ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, సీనియర్ నాయకులు డాక్టర్ ఎడమల శైలేంధర్ రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి, బీజేవైయం బాధ్యులు జగదీష్, చింత అనిల్ నాయకులు, కార్యకర్తలున్నారు.