గ్రామాల్లో వైద్య సేవలందించడం అభినందనీయం

ABN , First Publish Date - 2023-06-26T00:34:30+05:30 IST

డాక్టర్లు గ్రామాలను దత్తత తీసుకొని వైద్య సేవలందించడం అభినందనీయమని మేయర్‌ వై సునీల్‌రావు అన్నారు.

గ్రామాల్లో వైద్య సేవలందించడం అభినందనీయం
జెండా ఊపి డాక్టర్ల బృందాల వాహనాలను ప్రారంభించిన మేయర్‌ సునీల్‌రావు

సుభాష్‌నగర్‌, జూన్‌ 25: డాక్టర్లు గ్రామాలను దత్తత తీసుకొని వైద్య సేవలందించడం అభినందనీయమని మేయర్‌ వై సునీల్‌రావు అన్నారు. ఐఎంఏ ఆద్వర్యంలో చేపట్టిన ఆవో గావ్‌ చలే (రండి గ్రామాలకు పోదాం) అనే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌ డాక్టర్లు ఉమ్మడి జిల్లాలోని 22 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆదివారం నగరంలోని ఐఎంఏ భవన్‌ నుంచి ఆయా గ్రామాలకు తరళి వెళ్లే డాక్టర్ల బృందాలను ఆయన జెండా పూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక గ్రామాలను కరీంనగర్‌ ఐఎంఏ వైద్యులు దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. డాక్టర్లు దత్తత తీసుకున్న గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య సేవలందించడం వల్ల గ్రామీణ ప్రజలకు చాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కరీంనగర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పొలాస రాంకిరణ్‌, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ రజనీప్రియదర్శిని, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:34:30+05:30 IST