మెనూ ప్రకారం భోజనం అందించాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:43 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం అందించాలని జడ్పీ సీఈవో శ్రీనివాస్ అన్నారు.
పెద్దపల్లి రూరల్, డిసెంబరు 14 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం అందించాలని జడ్పీ సీఈవో శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని రంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పాఠ శాల తరగతులను పరిశీలించి విద్యార్థులను మధ్యాహ్న భోజనం, చదువు, విద్యాబో ధన విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వం అందించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులు తినే ముందు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా భోజనం చేయాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యను పరిశీలించి ఉపాధ్యాయులు విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు తోడ్పాటును అందించాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించినపుడే ఉపా ధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. వెంట ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.