తెలంగాణలో అత్యధికంగా మెడికల్‌ సీట్లు

ABN , First Publish Date - 2023-09-15T00:30:09+05:30 IST

దేశంలో అత్యధికంగా మెడికల్‌ సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

 తెలంగాణలో అత్యధికంగా మెడికల్‌ సీట్లు
సమావేశంలో మాట్లాడుతున్న కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, సెప్టెంబరు 14 : దేశంలో అత్యధికంగా మెడికల్‌ సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ సహకారంతో సిరిసిల్ల ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన ఎనిమిది మెడికల్‌ కాలేజీలను శుక్రవారం ప్రారంభించుకుంటున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా సెస్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు దాదాపు 20వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్‌ డైరెక్టర్‌ గౌరినేని నారాయణరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మంతరెడ్డి, వైస్‌ చైర్మన్‌ లింగమ్‌యాదవ్‌, ఉప సర్పంచ్‌ నాగరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆర్‌బీఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌, పట్టణ అధ్యక్షుడు వెంకటి, మండల ప్రధాన కార్యదర్శి గంద్యాడపు రాజు, పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-09-15T00:30:09+05:30 IST