ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
ABN , First Publish Date - 2023-12-10T23:17:05+05:30 IST
కార్తీక మాసం సందర్భంగా నగరంలోని చైతన్యపురికాలనీలో ఆదివారం సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 10: కార్తీక మాసం సందర్భంగా నగరంలోని చైతన్యపురికాలనీలో ఆదివారం సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పారువెల్ల ఫణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహికవ్రతాల్లో 108 మంది ఆర్యవైశ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫణిశర్మ మాట్లాడుతూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆ భగవంతుని సంకల్పమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్రతాల అనంతరం షిర్డి సాయి భక్త భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం అందించారు.