ఏఐటీయూసీని గెలిపిద్దాం.. సంస్థను కాపాడుకుందాం
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:17 AM
ఏఐటీయూసీని గెలిపించి సింగరేణిని కాపాడుకుందామని యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సారయ్య పిలుపు నిచ్చారు. ఓసీపీ-3 సీహెచ్‌పీలో శనివారం జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు
యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సారయ్య
యైుటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 16: ఏఐటీయూసీని గెలిపించి సింగరేణిని కాపాడుకుందామని యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సారయ్య పిలుపు నిచ్చారు. ఓసీపీ-3 సీహెచ్‌పీలో శనివారం జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో మొదటి కార్మిక సంఘంగా ఇప్పటి వరకు ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిలిచిందని, ప్రస్తుతం కార్మికులు అనుభవిస్తున్న హక్కులు ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సాధించినవేనని అన్నారు. కార్మికులకు నష్టం చేసే సంఘాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీహెచ్‌పీలో ట్రాలీ ఆపరేటర్, శెంటింగ్ మజ్దూర్, లారీ మొకద్దాం, కన్వేయర్ ఆపరేటర్, టెండాల్ వంటి డిసిగ్నేషన్‌లను ఇప్పించిన ఘనత ఏఐటీయూసీకు దక్కుతుందని సారయ్య అన్నా రు. గడిచిన 10 ఏళ్ళలో నిధుల మళ్ళింపు, రాజకీయ జోక్యం కారణాలతో సింగరేణి గాడితప్పిందని, ప్రస్తుతం ఏఐటీయూసీ వంటి సమర్థవంతమైన యూనియన్ అవసరం అన్నారు. ఈగేట్‌మీటింగ్‌లో ఎల్ ప్రకాష్, రాజారత్నం, జిగురు రవీందర్, అన్నారావు, శ్యాంసన్, సాంబశివరావు, బుర్ర తిరుపతి, అల్లి రమేష్ పాల్గొన్నారు.