శాశ్వత భవనాలతో న్యాయ సేవలు సులభతరం

ABN , First Publish Date - 2023-02-02T00:07:34+05:30 IST

కోర్టులు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్న కోర్టులకు అన్ని సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మించడం వల్ల కక్షిదారులకు న్యాయ సేవలు సులభతరం అవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్వల్‌ భూయాన్‌ పేర్కొన్నారు.

శాశ్వత భవనాలతో న్యాయ సేవలు సులభతరం

కోల్‌సిటీ, ఫిబ్రవరి 1: కోర్టులు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్న కోర్టులకు అన్ని సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మించడం వల్ల కక్షిదారులకు న్యాయ సేవలు సులభతరం అవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్వల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని శారదానగర్‌లో 19.75కోట్ల వ్యయంతో ఆరంతస్థుల్లో నిర్మిస్తున్న ఆరు కోర్టు భవనాలు, ఆరు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వేల కేసులు ఉన్న గోదావరిఖని కోర్టుకు శాశ్వత భవన నిర్మాణంతో సౌకర్యాలు కలుగనున్నాయన్నారు. శాశ్వత భవనాలు ఏర్పాటు వల్ల ఆధునిక పరికరాలు, పూర్తిస్థాయి డిజిటల్‌ విధానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కోర్టు కార్యకలాపాలు కూడా వేగవంతం జరుగుతాయని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని న్యాయమూర్తి సూచించారు. రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు పీ నవీన్‌రావు, జిల్లా పోర్ట్‌పోలియో జడ్జి వీ శ్రావణ్‌కుమార్‌లు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో కోర్టులకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు మాట్లాడు తూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భవన నిర్మాణాల శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌కుమార్‌, గోదావరిఖని ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి టీఎస్‌పీ భార్గవి, మొదటి అదనపు న్యాయస్థానం జడ్జి దుర్గం గణే ష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు చందాల శైలజ, జవ్వా జి శ్రీనివాస్‌, సీనియర్‌ న్యాయవాదులు విశ్వేర్‌రావు, అమరేందర్‌రావు, పాత అశోక్‌, రవీందర్‌సింగ్‌, సంజయ్‌కుమార్‌, శంతన్‌, బార్‌ అసొసియేషన్‌ కమిటీ సభ్యులు నుచ్చు శ్రీనివాస్‌, గుర్రం నారాయ ణ, భూమయ్య, పద్మజ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:07:40+05:30 IST