కన్నుల పండువగా లక్ష పుష్పార్చన

ABN , First Publish Date - 2023-01-02T00:27:06+05:30 IST

పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండు వగా జరిగింది.

కన్నుల పండువగా లక్ష పుష్పార్చన
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్న వేదపండితుడు రాంశర్మ

కోరుట్ల, జనవరి 1 : పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండు వగా జరిగింది. దేవాలయంలో వేదపండితుడు పాలెపు రాంశర్మ, వినయ్‌ మం త్రోచ్చారణల మద్య కార్యక్రమం నిర్విహించారు. దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిపారు. మూల విరాట్‌కు అభిషేకం, అర్చన, పంచామృత అ భిషేకాలను నిర్వహించారు. అనంతరం అయ్యప్పకు లక్ష పుష్పార్చన మహోత్స వం అయ్యప్ప శరణు గోషతో నిర్వహించారు. అయ్యప్ప అభివృద్ధి కమిటీ సభ్యు లు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరపారు. ఆర్డీవో వినోద్‌ కుమార్‌ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడు చిద్రాల నారాయణలతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీఆధ్వర్యం లో భక్తులకు, అయ్యప్ప స్వాములకు బిక్షను అందజేశారు. ఈ కార్యక్రమంలో అ య్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-02T00:27:08+05:30 IST