మహిళా చట్టాలపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2023-12-06T00:16:30+05:30 IST
మహిళా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ సూచించారు.
తంగళ్లపల్లి, డిసెంబరు 5: మహిళా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ సూచించారు. మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంతోపాటు తాడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి ఆర్థిక స్థోమత లేకపోతే ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుం దన్నారు. చిన్నచిన్న తగాదాలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కో వాలన్నారు. లోక్ ఆదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆంజయ్య, పెంట శ్రీనివాస్, పాఠశాల మెచ్‌ఎం, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.