Share News

ఉమ్మడి జిల్లా నేతలకు కీలక శాఖలు

ABN , First Publish Date - 2023-12-10T00:48:59+05:30 IST

రాష్ట్రంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభా వ్యవహారాలశాఖలను కేటాయించారు. పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమశాఖలను అప్పగించారు.

ఉమ్మడి జిల్లా నేతలకు కీలక శాఖలు

- దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు

- పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్రంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభా వ్యవహారాలశాఖలను కేటాయించారు. పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమశాఖలను అప్పగించారు.

ఫ మన నేతకే మరోసారి ఐటీ శాఖ

శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పనిచేసిన, అనుభవం ఉన్న శ్రీధర్‌బాబుకు కీలక శాఖలను అప్పగించారు. రాష్ట్ర తొలి ఐటీశాఖ మంత్రిగా జిల్లాకే చెందిన సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ విధులు నిర్వర్తించగా, రెండోసారి జిల్లాకు చెందిన శాసనసభ్యుడినే ఆ పదవి వరించింది. రాష్ట్రంలో ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ హబ్‌లను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రిత్వశాఖకు ప్రాధాన్యత పెరిగింది. ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా తోడ్పడే ఐటీశాఖ మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించింది. శ్రీధర్‌బాబుకు పరిశ్రమల శాఖను కూడా అప్పగించారు.

ఫ బీసీ నాయకుడికి బీసీ సంక్షేమం..

మరోమంత్రి పొన్నం ప్రభాకర్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖలను అప్పగించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు ఆయా సామాజికవర్గాల వారితో సత్సంబంధాలు ఉండడమే కాకుండా రాజకీయంగా బీసీ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయనకు బీసీ సంక్షేమశాఖను అప్పగించి సంక్షేమ ఫలితాలను మరింత విస్తృతంగా వెనుకబడిన తరగతులకు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జిల్లాకే చెందిన గంగుల కమలాకర్‌ బీసీ సంక్షేమశాఖను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఐటీ, బీసీ సంక్షేమశాఖలు ఈ జిల్లాకే చెందిన వారికి ఉండగా కాంగ్రెస్‌ మంత్రి వర్గంలోనూ ఈ రెండు శాఖలు జిల్లాకు చెందిన వారినే వరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

Updated Date - 2023-12-10T00:49:40+05:30 IST