వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ABN , First Publish Date - 2023-03-25T23:52:49+05:30 IST

జిల్లాకు చెందిన రచయిత, సినీ విమర్శకుడు వారాల ఆనంద్‌ గోవా రాష్ట్రంలోని పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ శనివారం అందకున్నారు.

వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
కేంద్ర సాహిత్య అకాడమీ అఽఽధ్యక్షుడు మాధవ్‌కౌశిక్‌ నుంచి అవార్డు అందుకుంటున్న వారాల ఆనంద్‌

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 25: జిల్లాకు చెందిన రచయిత, సినీ విమర్శకుడు వారాల ఆనంద్‌ గోవా రాష్ట్రంలోని పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ శనివారం అందకున్నారు. ప్రముఖ కవి గుల్జార్‌ రాసిన గ్రీన్‌ పోయెమ్స్‌ కవిత్వాన్ని తెలుగులోకి ఆకుపచ్చ కవితలు పేరిట అనువాదం చేశారు. ఈ సంపుటికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పురస్కారం కింద 50 వేల రూపాయలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అఽఽధ్యక్షుడు మాధవ్‌కౌశిక్‌ చేతుల మీదుగా అందుకున్నారు. అతిథిగా కొంకణీ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దామోజర్‌ మౌజో హాజరవగా అకాడమీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుముద్‌శర్మ, కార్యదర్శి డాక్టర్‌ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:52:49+05:30 IST