కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-01T00:34:00+05:30 IST

కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. అనంతరం రెస్ట్‌హౌస్‌లోని గదులను పరిశీ లించారు.

కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌,   ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ప్రారంభం
కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌ ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 31: కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. అనంతరం రెస్ట్‌హౌస్‌లోని గదులను పరిశీ లించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న దళితబంధుతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. మార్చి 2022 నుంచి జనవరి 2023 సంవత్సరం వరకు పట్ట ణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించిన జిల్లా పట్టణ ప్రగతి పుస్తకాన్ని మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, దాసరి మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కోరుకంటి చం దర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ లెనిన్‌, జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ పాల్గొన్నారు.

అడ్డుకునేందుకు ఏబీవీపీ యత్నం.. కార్యకర్తల అరెస్టు

నగరంలోని కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాల ప్రారంభోత్సవం చేసేందుకు వచ్చిన రాష్ట్ర ము న్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావును ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ఉదయం 10.30 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌తో రెస్ట్‌హౌస్‌లోకి వస్తుండగా ప్రధానద్వారం ఎదుట పోలీసులను ఛేదించుకుని ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని ప్రా రంభించేందుకు వెళ్తుండగా మరికొంత మంది ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. రెండు విడత లుగా మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 14 మంది ఏబీ వీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

వచ్చారు.. వెళ్లారు : నగరంలో గంట సేపే మంత్రి కేటీఆర్‌ పర్యటన

కరీంనగర్‌ టౌన్‌: రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన గంటలో ముగిసింది. హైదరాబాద్‌ నుంచి హెలీక్యాప్టర్‌లో మం త్రి ఎరబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌తో కలిసి కరీంనగర్‌కు వచ్చారు. ఉద యం 10.20 గంటలకు కరీంనగర్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ సర్య్కూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాలను ప్రారం భించి 11.20 నిమిషాలుకు హెలీప్యాడ్‌కు చేరుకొని జమ్మికుంటకు వెళ్లారు.

ఘన స్వాగతం పలికిన నేతలు... ప్రజాప్రతినిధులు

హెలీప్యాడ్‌ పార్కు వద్ద రాష్ట్ర మున్సిపల్‌ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. రెస్ట్‌హౌస్‌లో మంత్రి కేటీఆర్‌ ను మేయర్‌ సునీల్‌రావు నేతృత్వంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూప రాణితోపాటు కార్పొరేటర్లు కలిసి కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించారం టూ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌ టాప్‌ విజనరీస్‌ హు చేంజ్‌డ్‌ ద వరల్డ్‌ అనే పుస్తకాన్ని బహుకరించారు.

Updated Date - 2023-02-01T00:34:03+05:30 IST