కమనీయం...దుబ్బ రాజన్న రథోత్సవం
ABN , First Publish Date - 2023-02-21T00:11:55+05:30 IST
శ్రీ దుబ్బ రాజన్న రథోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు.
సారంగాపూర్, పిబ్రవరి, 20: శ్రీ దుబ్బ రాజన్న రథోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానఘట్టం రథోత్సవం చివరిరోజు కావడంతో వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమాలల నుంచే కాకుండా మహరాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తు న భక్తులు తరలి వచ్చారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు 2 లక్షల పైన భక్తులు స్వామి వారిని దర్శంచుకున్నట్లు ఆల య అధికారులు తెలిపారు. రథోత్సవం సందర్భంగా వివిధ రకాల పూలతో రథాన్ని అందంగా అలంకరించారు. రథం ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి ఆలయ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సమయంలో శివనామ స్మరణలతో ఆలయ పురవీధులు మార్మోగాయి. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ ప్రకాష్ దగ్గ రుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఐ అరీప్ అలీఖాన్, ఎసై మనో హర్‌రావు సూచనల మేరకు రోప్ పార్టీ సహాయంతో రథాన్ని ముం దుకు లాగారు. భక్తులు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి రథం వద్ద మొ క్కులు చెల్లించుకున్నారు. రథం ఎదుట ఒగ్గుడోలు కళాకారుల వి న్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఎం పీపీ కోల జమున శ్రీనివాస్, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, సీనియర్ నాయకులు ముప్పాల రాంచందర్‌రావు, కొలు ముల రమణ, సర్పంచ్‌లు, బొడ్డుపెల్లి రాజన్న, ఆకుల జమున రాజి రెడ్డి, గుర్రాల రాజేందర్‌రెడ్డి, ఈవో కాంతరెడ్డి, ఆలయ చైర్మన్ శంక రయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంచందర్‌రెడ్డి, ఎంపీ టీసీ సుధాకర్‌రావు, డిల్లీరామరావు, బీజేపీ మండల అధ్యక్షులు వరు ణ్‌కుమార్, మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్, యువ నాయకలు తోట లక్ష్మణ్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు