జగిత్యాల కలెక్టర్‌గా షేక్ యాస్మిన్ బాషా
ABN , First Publish Date - 2023-02-02T00:47:42+05:30 IST
జగిత్యాల నూతన కలెక్టర్‌గా షేక్ యాస్మిన్ బాషా బాధ్యతలు చేపట్టారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మూడవ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న షేక్ యాస్మిన్ బాషాను జగిత్యాల కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసిన మేరకు బాధ్యతలు స్వీకరించారు.
జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల నూతన కలెక్టర్‌గా షేక్ యాస్మిన్ బాషా బాధ్యతలు చేపట్టారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మూడవ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న షేక్ యాస్మిన్ బాషాను జగిత్యాల కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసిన మేరకు బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్‌గా వచ్చిన షేక్ యాస్మిన్ బాషాను పలువురు కలెక్టర్ కార్యాలయ సూపరెండెంట్లు, రెవెన్యూ అధికారులు, అధికారులు, ఉద్యో గులు అభినందించారు. పూలమొక్కలు, పుష్పగుచ్చాలు అందించడంతో పాటు శాలువలతో సత్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యం మేరకు పూర్తయ్యేలా పనిచేస్తానన్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన అనుభవం వల్ల ఇక్కడి ప్రాంత సమస్యలు, పరిస్థితులపై కొంత అవగాహణ ఉందన్నారు. అనంతరం పలువురు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, మంద మకరందు, ఆర్డీఓ మాదురి, కలెక్టర్ కార్యాలయ ఏఓ నాగార్జున, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వకీలు, టీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బోగ శశిధర్, హరి అశోక్ కుమార్, పలువురు రెవెన్యూ అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. యాస్మిన్ బాషా 2008 నుంచి వివిధ హోదాల్లో పనిచేసి 2015 సంవత్సరంలో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో రాజన్న సిరిసిల్ల జాయిట్ కలెక్టర్‌గా నియామకం అయ్యారు. 2020 ఫిబ్ర వరిలో వనపర్తి కలెక్టర్‌గా నియామకమై బాధ్యతలు చేపట్టారు. మూడు సంవత్సరాల పాటు వనపర్తి జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన షేక్ యాస్మిన్ బాషా జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.