విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పిన జ్యోతిబాఫూలే
ABN , First Publish Date - 2023-04-12T00:34:25+05:30 IST
చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని, విద్య యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.
- కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
- ఘనంగా మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు
పెద్దపల్లి కల్చరల్ , ఏప్రిల్ 11: చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని, విద్య యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో కలెక్టర్ ఎస్. సంగీతసత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తిని కొనసా గించేందుకు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహిస్తోందన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని తెలిపారు. సామాజి క సమానత్వ సాధన కోసం జ్యోతిబాఫూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా కొనసాగించాలన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ బాలికలకు, స్త్రీలకు విద్యను అందించిన మహనీ యులు జ్యోతిబాఫూలే అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి అంబేద్కర్, జ్యోతిబాఫూలే వంటి మహనీయుల స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సిం గ్, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, లక్ష్మణ్, గంట రాములు, బీఎస్పీ పెద్దపల్లి ఇన్‌చార్జి దాసరి ఉష, జిల్లా టీజీవో అధ్యక్షుడు, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌చైర్మన్ తూము రవీందర్, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.