జూన్ 2న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2023-05-26T00:18:55+05:30 IST
: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను జూన్2న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని, పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కాంట్రాక్టర్‌లు, అధికారులను ఆదేశించారు

సిరిసిల్ల రూరల్, మే25 : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను జూన్2న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని, పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కాంట్రాక్టర్‌లు, అధికారులను ఆదేశించారు సిరిసిల్ల అర్బన్ పరిఽధిలోని పెద్దూర్, రగుడు, శాంతినగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై మున్సిపల్, సెస్, రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం పరిఽశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగుడు, శాంతినగర్, పెద్దూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి సూయూజ్ నెట్ వర్క్, వాటర్ సంప్, సెఫ్టిక్ ట్యాంక్, రోడ్డు నెట్ వర్క్ వంటి పెండింగ్ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు పాల్గొన్నారు.
ధాన్యం లోడింగ్ అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లోడింగ్, అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ రైస్‌మిల్లర్లును ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దబోనాల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేసి రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అన్‌లోడింగ్ చేసుకోవాలన్నారు. ధాన్యం అన్‌లోడింగ్ సమయంలో కొందరు రైస్‌మిల్లర్లు కోతలు విధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కోతలు పెడితే సదరు రైస్‌మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.