సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-03-28T00:17:27+05:30 IST
ప్రజావాణిలో సమర్పించే దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 27 : ప్రజావాణిలో సమర్పించే దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ కిటకిటలాడిపోయింది. ప్రజావాణి కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 28 అర్జీలు రాగా అందులో రెవెన్యూ 143, డీపీవో2, సిరిసిల్ల మున్సిపాలిటీ 4, సబ్‌రిజిస్ర్టార్ 1, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 2, విద్యాశాఖ 1, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో 1, డీఆర్‌డీవో 2, తంగళ్లపల్లి ఎంపీబీవో 1 చొప్పున వచ్చాయి, ఈ సందర్భంగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, త్వరితగితన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీ దారులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.