బ్యాంకింగ్‌ సేవలకు అనాసక్తి

ABN , First Publish Date - 2023-03-26T00:59:21+05:30 IST

చౌక ధరల దుకాణాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రేషన్‌ డీలర్ల అనాసక్తత కారణంగా నీరు గారుతోంది. చౌక ధరల దుకణాల్లో ఇతర సేవలు అందించడానికి రేషన్‌ డీలర్లు అనాసక్తత కనబరుస్తున్నారు.

బ్యాంకింగ్‌ సేవలకు అనాసక్తి

జిల్లాలో 12 మంది రేషన్‌ డీలర్లే దరఖాస్తు

నీరుగారనున్న ప్రభుత్వ లక్ష్యం

ఈనెలాఖరు వరకు అవకాశం

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): చౌక ధరల దుకాణాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రేషన్‌ డీలర్ల అనాసక్తత కారణంగా నీరు గారుతోంది. చౌక ధరల దుకణాల్లో ఇతర సేవలు అందించడానికి రేషన్‌ డీలర్లు అనాసక్తత కనబరుస్తున్నారు. భవిష్యత్తులో సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌)గా రేషన్‌ దుకాణాలల్లో సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీవో)తో అనుసంధానమైంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా పౌ రసరఫరాల శాఖ అధికారులు రెండు నెలల క్రితం అవగాహన కల్పించా రు. జిల్లాలోని రేషన్‌ డీలర్లు దీనిపై ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఇందులో పెగడపల్లి మండలం నుంచి ఏడుగురు, రాయికల్‌ మండలం నుంచి ము గ్గురు, జగిత్యాల రూరల్‌ మండలం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చే సుకున్నారు. మిగిలిన వారు దరఖాస్తు చేసేందుకు ఈనెలాఖరు వరకు అ వకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత సేవలు ప్రజలకు ఉపయో గకరంగా మారనున్న నేపథ్యంలో అన్ని దుకాణాల్లో ప్రారంభిస్తే ప్రయోజ నంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రూ. 5 వేలు సెక్యూరిటీ డి పాజిట్‌, రూ. 1,200 నమోదు రుసుము వసూలు చేస్తారు. ఈనెలాఖరు లోపు దరఖాస్తు చేసుకున్న రేషన్‌ డీలర్లకు రూ. 5 వేలు సెక్యూరిటీ డిపా జిట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు.

మినీ బ్యాంకులుగా..రేషన్‌ దుకాణాలు..

జిల్లా వ్యాప్తంగా 592 రేషన్‌ దుకాణాలున్నాయి. వీటి ద్వారా ప్రతీ నెల 3,07,852 వివిధ కార్డు దారులకు సరుకులు అందింస్తుంటారు. ఇందులో 2,93,354 మంది ఆహార భద్రత కార్డు దారులకు, 14,352 ఏఎఫ్‌సీ, 146 అన్నపూర్ణ కార్డు దారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ డీలర్లు కమీషన్‌ పొందుతుంటారు. ఈ కమిషన్‌ సరిపోక డీలర్లు ఇబ్బందులు ప డుతున్నారు. ఈ క్రమంలో వారికి ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రేషన్‌ డీలర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డీలర్లు ఆర్థిక లావాదేవీ లు జరిపితే కమీషన్లను అందించనున్నారు. దీనికి అవసరమైన బయో మె ట్రిక్‌ పరికరం, ఆధార్‌ ఎనెబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (పీఈపీఎస్‌) ఇవ్వను న్నారు. డీలర్ల సెల్‌ఫోన్లలో ఐపీపీబీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ప్ర త్యేకంగా డిజిటల్‌ ఖాతా తెరిచి దీని ద్వారా రూ. 10 వేల వరకు నగదు, డి జిటల్‌ లావాదేవీలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ లావాదేవీకి రూ. 4 చొప్పున, నెలలో రూ. 5 లక్షలు బిజినెస్‌ దాటితే మరో రూ. 11 చొప్పున చెల్లించనున్నారు. ప్రతీనెల పక్షం రోజుల పాటు రేషన్‌ డీ లర్లు సరుకులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత డీలర్లు ఖాళీగానే ఉం టారు. ఈ సమయాన్ని డిజిటల్‌ లావాదేవీలకు వినియోగించడం వల్ల స మయం, ఆదాయం సమకూరనుంది.

వీలైనన్ని ఎక్కువ కేంద్రాలు తెరుస్తాం

చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి

జగిత్యాల జిల్లాలో రేషన్‌ డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడం, డిజి టల్‌ లావాదేవీలు విస్తరింపజేయడమే లక్ష్యంగా చౌకదుకాణాల్లో ఆర్థిక సేవ లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లాలో ఇప్పటికే డీలర్లకు అవగాహన కల్పించాము. ఆసక్తి ఉన్న డీల ర్లు సంబంధిత దృవపత్రాలను జత పరచి పోస్టల్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన కల్పించాలి

- నందయ్య, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో చౌకదుకాణాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ముందుకు రావడం లేదు. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లుగా వ్యవహరించడానికి ప్రత్యేక డిపాజిట్లు, నమోదు రుసుము చెల్లించాల్సి రావడం, సాంకేతిక పరిజ్ఞానం అవసరముండడంతో రేషన్‌ డీలర్లు ముందుకు రావడం లేదు. స్వల్ప సం ఖ్యలో మాత్రమే రేషన్‌ డీలర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకింగ్‌ సేవ లపై రేషన్‌ డీలర్లకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది.

Updated Date - 2023-03-26T00:59:21+05:30 IST