ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-06-11T00:25:38+05:30 IST

కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరి స్తోందని సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు.

ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వం
జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు

ఇల్లంతకుంట, జూన్‌ 10: కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరి స్తోందని సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు అన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లో శనివారం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. తొలుత గ్రామ ంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు రూ.11లక్షల కోట్ల పన్ను రాయితీలను ఇచ్చిందని, ఉపాధి కూలీలుగా జీవిస్తున్న 40కోట్ల మందికి రూ.60వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని అన్నారు. ఒడి స్సాలో రైలు దుర్ఘటనకు ప్రధానమంత్రి అవలంబిస్తున్న రైల్వే ప్రైవేటీకరణ విధానాలే కారణమన్నారు. పార్లమెంట్‌ భవనం ప్రారంభించడానికి ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడం బీజేపీ వైఖరికి నిదర్శనమన్నారు. కష్టజీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్రజెండా మాత్రమే అన్నారు. అనంతరం మూఢ విశ్వాసాలపై విజ్ఞానదర్శిని రాష్ట్ర కన్వీనర్‌ రమేష్‌, మతోన్మాదంపై సోషల్‌మీడియా ఇన్‌చార్జి పిట్టల రవి అవగాహన కల్పించారు. జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు గన్నారం నర్సయ్య, ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమ ణ, గురిజాల శ్రీధర్‌, మల్లారపు ప్రశాంత్‌, అనీల్‌కుమార్‌, శ్రీరాం, సదానందం, అజయ్‌, బాబు, సత్యం, భిక్షపతి, రాములు, శ్రీనివాస్‌, వసంత పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:25:38+05:30 IST