Share News

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను..

ABN , First Publish Date - 2023-12-10T23:47:49+05:30 IST

ప్రజలు తనపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను..

గోదావరిఖని, డిసెంబరు 10: ప్రజలు తనపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మక్కాన్‌ సింగ్‌ ఆదివారం రామగుండానికి రాగా ఆయనకు బసంత్‌నగర్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జి ల్లాలోనే తనపై ప్రజలు విశ్వాసంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి అసెంబ్లీకి పంపారని, చివరిశ్వా స వరకు ప్రజలకు అండగా ఉంటూ ప్రజా స మస్యలపై పోరాటం చేస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఎన్నికల సమయం లో తాను ఇచ్చినమాట ప్రకారం సమస్యలు పరి ష్కరించి రామగుండం ప్రాంతానికి పూర్వవైభ వం తీసుకువస్తానని, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తానన్నారు. రామగుండంలో అభివృద్ధి పనుల కు శ్రీకారం చుట్టనున్నట్టు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఔట్‌ సోర్సింగ్‌, కాం ట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం గా పని చేస్తానని, తనను ఆదరించిన రామగుం డం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. బీ పవర్‌హౌస్‌ నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ మక్కాన్‌సింగ్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, ఎండీ ముస్తాఫా, పెద్దెల్లి తేజస్వి, నాయకులు కాల్వ లింగస్వామి, పెండ్యాల మహేష్‌, ఆసిఫ్‌, బొమ్మక రాజేష్‌, మారెల్లి రాజిరెడ్డి పాతిపెల్లి ఎల్లయ్య, తిప్పారపు శ్రీనివాస్‌, పెద్దెల్లి ప్రకాష్‌, సుతారి లక్ష్మణ్‌బాబు, పెంచాల తిరుపతి, జనగామ శ్రీనివాస్‌, దీటి బాలరాజు, వివిధ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:47:53+05:30 IST