మాస్టర్‌ ప్లాన్‌ రద్దు బాధ్యత నాదే : ఎమ్మెల్యే సంజయ్‌

ABN , First Publish Date - 2023-01-15T00:03:24+05:30 IST

జగిత్యాల బల్దియా నూతన మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా రద్దుకు ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యత వహించి, రైతుల సెంటు భూమి కూడా పోనివ్వనని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు.

మాస్టర్‌ ప్లాన్‌ రద్దు బాధ్యత నాదే  : ఎమ్మెల్యే సంజయ్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, జనవరి 14: జగిత్యాల బల్దియా నూతన మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా రద్దుకు ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యత వహించి, రైతుల సెంటు భూమి కూడా పోనివ్వనని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొం దించడంలో కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పొరపాటు జరిగిందన్నారు. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. రాజకీ య అవకాశవాదులు తమ పబ్బం గడుపుకోవడానికి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు మరిచిపోవడంతో వారు రాజకీయ నిరుద్యోగుల్లా మారి నిత్యం పేపర్లలో, టీవీల్లో కనిపించేం దుకు తహతహలాడుతున్నారన్నారు. జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలను మున్సిపల్‌లో చేర్చాలనే ప్రతిపాదన ను సైతం ఒప్పుకోలేదన్నారు. అవసరమైతే ప్రభుత్వ భూ ములను నూతన మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చేలా చర్యలు తీసు కుంటామన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు బొడ్ల జగ దీష్‌, గుగ్గిల్ల హరీష్‌, అల్లె గంగాసాగర్‌, అవారి శివకేసరి బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:04:06+05:30 IST