అనువంశిక అర్చకులకు ప్రాధాన్యమిస్తాం
ABN , First Publish Date - 2023-05-05T00:05:44+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల నియామకంలో ఆలయ అనువంశిక అర్చక కుటుంబాల వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు.
వేములవాడ, మే 4: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల నియామకంలో ఆలయ అనువంశిక అర్చక కుటుంబాల వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. ఆలయ అనువంశిక అర్చక కుటుంబాల సభ్యులతో గురువారం ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలలో ఖాళీల భర్తీ సమయంలో అనువంశిక అర్చకులకు న్యాయం జరిగేలా విధానపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేములవాడ రాజరాజేశ్వర అనువంశిక అర్చక ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మామిడిపల్లి రాజన్న, ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, అనువంశిక అర్చక సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు ఈశ్వరగారి రమణ, నేతలు మామిడిపల్లి కృష్ణమూర్తి, డాక్టర్ మధు రాధాకిషన్, గర్శకుర్తి వెంకటేశ్వర్లు, బుడెంగారి మహేశ్, ఆలయ అర్చకులు చంద్రగరి శరత్, నమిలికొండ ఉమేశ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.