ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2023-09-18T01:08:18+05:30 IST

ల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
జాతీయ జెండాకు వందనం చేస్తున్న లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 17: జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యమాల చరిత్రకు మారుపేరు కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో ఎందరో అమరులయ్యారన్నారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నేహ్రూ, హోంశాఖ మంత్రి సర్ధార్‌ వల్లాబాయ్‌ పటేల్‌ సైనిక చర్యతో హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం. పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్త మోహన్‌, మున్సిపల్‌ ప్లోర్‌లీడర్‌ కల్లెపెల్లి దుర్గ య్య, నాయకులు గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, దేవేందర్‌రెడ్డి, రాధాకిషన్‌రావు, చిట్ల అంజన్న, అల్లాల రమేష్‌ రావు, కోర్టు శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2023-09-18T01:08:18+05:30 IST