ప్రధాన రహదారిపై ఊడిన గ్రానైట్‌ లారీ లింకు

ABN , First Publish Date - 2023-03-18T23:17:56+05:30 IST

గ్రానైట్‌ రాయిని తరలిస్తున్న లారీ లింకుప్రమాదవ శత్తు ఊడిపోయి రెండు బాగాలుగా విడిపోయింది.లింకు ఊడిన సమయంలో ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఉన్నప్పటికి ఏలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రధాన రహదారిపై ఊడిన గ్రానైట్‌ లారీ లింకు
రోడ్డుపై పడిన గ్రానైట్‌ లారీ లింకు

-తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు

గంగాధర,మార్చి18: గ్రానైట్‌ రాయిని తరలిస్తున్న లారీ లింకుప్రమాదవ శత్తు ఊడిపోయి రెండు బాగాలుగా విడిపోయింది.లింకు ఊడిన సమయంలో ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఉన్నప్పటికి ఏలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మ్యాడంపల్లి నుండి కరీంనగర్‌కు లారీలో గ్రానైట్‌ రాయిని తరలిస్తున్నారు. కరీంనగర్‌,జగిత్యాల ప్రఽధాన రహదారి గంగాధర మండలం మధురానగర్‌ చౌరస్తాలో లారీ లింకు ప్రమాదవశత్తు ఊడిపోయింది.దీంతో బారీ రాయితో పాటు లింకు రోడ్డుమద్యలో నిలిచిపోగా ఇంజన్‌ అదేవేగంతో అంబేద్కర్‌ విగ్రహా గద్దెను డీ కొట్టింది. శనివారం వారసంత కావడంతో ప్రజలు,వ్యాపారులు చుట్టు జిల్లాల నుండి గంగాధరకు వస్తుంటారు. సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు, ఇటు ప్రధాన రహదారి పూర్తిగా రద్దీగా ఉంటుంది. రద్దీ ప్రాంతంలో లింకు ఊడినప్పటికి లింకునుండి రాయి కిందపడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. రోడ్డు మధ్యలో రాయితో లింకు పడిపోగా ప్రధాన రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగించారు. ఎస్‌ఐ అభిలాష్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2023-03-18T23:17:56+05:30 IST