ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-06-26T00:37:37+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

గోదావరిఖని, జూన్‌ 25: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు. ఆదివారం రా మగుండం కార్పొరేషన్‌లోని 6వ డివిజన్‌ సప్తగిరి కాలనీలో సుమారు 300 మంది మహిళలు, యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేరలేదన్నారు. రామగుం డం నియోజకవర్గానికి స్థానిక శాసన సభ్యుడు ఒక్క రూపాయి నిధి కూడా తీసుకురాలేదని, రామగుండం కార్పొరేషన్‌లో ఏ డివిజన్‌కు వెళ్లినా సమస్యలతో సతమవుతున్నారని, ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా ఉందన్నారు. రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే, మేయర్లు ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టా రో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, మారెల్లి రాజిరెడ్డి, గట్ల రమే ష్‌, పీక అరుణ్‌, నాజీమ్‌, ఖదీర్‌పాషా, ఆరిఫ్‌, సత్యప్రసాద్‌, మీనమ్మ, విజయ్‌, వంశీ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:37:37+05:30 IST