షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2023-09-23T00:25:33+05:30 IST
ముత్యంపేట షుగర్ ప్యాక్టరీ తెరిపించ డంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ ని యోజకవర్గ ఇంచార్జు జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు.
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ రావు
కోరుట్ల రూరల్, సెప్టెంబరు 22 : ముత్యంపేట షుగర్ ప్యాక్టరీ తెరిపించ డంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ ని యోజకవర్గ ఇంచార్జు జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. శుక్రవారం మం డలంలోని అయిలాపూర్ గ్రామంలో చెరుకు రైతులతో కలిసి ముత్యంపేట షుగర్ ప్యాక్టరీ వరకు పాదయత్ర కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాంకు కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు, కృష్ణా రావు రైతులతో కలిసి పూలమాల వేసి నివాళ్ళను అర్పించారు. ఈ సంద ర్బంగా నర్సింగ రావు మాట్లాడారు. రైతులకు తీవ్ర అన్యాయం రాష్ట్ర ప్రభు త్వం చేస్తుదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. ముత్యంపేట షుగర్ ప్యాక్టరి పునరుద్దరణ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. అవనీతి పరిపానను అందిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీకి వచ్చె ఎన్నికలో ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు. అనతరం ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ గ్రామంలోని పురవీదుల మీదిగా యూసుఫ్‌నగర్ నుండి ముత్యం పేట షుగర్ ప్యాక్టరి వైపు సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, కొంతం రాజం, సత్యనారాయణ గౌడ్, పన్నాల అంజిరెడ్డి, పుల్లారెడ్డి, కుర్మ తిరుపతి రెడ్డి, ముస్కు గంగిరెడ్డి, ముక్కెర రాజేంధర్, రాజేష్, తోట్ల మహేష్, మారుపాక సుమన్, చిలివేరి వంశీ, గణేష్, జెట్టి లింగం, శ్రీకాంత్ రెడ్డి, మహేంధర్ రెడ్డి, ప్రవీణ్, రాజంధర్ రెడ్డి, రాజిరెడ్డి, బుచ్చిరెడ్డి, అందే మారుతి, సురేంధర్ రెడ్డి, పోతు శేఖర్, భూమరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.