అభివృద్ధి పనులను ప్రారంభించిన జీఎం

ABN , First Publish Date - 2023-03-31T00:16:38+05:30 IST

ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకేఏ ఇంక్లైన్‌లో పలు అభి వృద్ధి పనులను ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ గురువారం ప్రారంభించారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన జీఎం

గోదావరిఖని, మార్చి 30: ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకేఏ ఇంక్లైన్‌లో పలు అభి వృద్ధి పనులను ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడీకే 11ఇంక్లైన్‌లో రెండవ కంటిన్యూయస్‌మైనర్‌ను ప్రవేశపెట్టి సింగరేణిలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తిని చేస్తుందని, కార్మికుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆర్‌వోఆర్‌ ప్లాంట్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఉద్యోగులు, అధికారు లు సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కంటిన్యూయస్‌మైనర్‌ ఆపరేటర్లు, రామ్‌కార్‌, సెటిల్‌ కార్‌ ఆపరేటర్లు, కోల్‌ కట్టర్లకు పదోన్నతి పత్రాలను అందజేశారు. అనంతరం ఈనెల31న పదవీవిరమణ పొం దనున్న జీఎంను ఉద్యోగులు, అధికారుల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు, ఏజెంట్‌ చిలుక శ్రీని వాస్‌, మేనేజర్‌ నెహ్రూ, సేఫ్టీ అధికారి సురేష్‌, పిట్‌ ఇంజనీర్‌ రాజబాబు, హనుమాన్‌దాస్‌, పిట్‌ సెక్రటరీ నాయిని శంకర్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, డీవై ఎస్‌ఈ వసంతకుమార్‌, సూపర్‌వైజర్‌ పెద్దపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:16:38+05:30 IST